![]() |
![]() |

స్టార్ యాంకర్ గా పేరుతెచ్చుకున్న అరియనా బిగ్ బాస్ షోకి కూడా వెళ్లి మంచి పేరును సంపాదించుకుంది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించి తన నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రామ్ గోపాల్ వర్మకు అత్యంత సన్నిహితురాలుగా మెలిగిన ఈ బ్యూటీ ఆరియానా గురించి చెప్పాలంటే ఒకానొకప్పుడు ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి హైలైట్ అయ్యింది. అలాగే ఆర్జీవీ బ్యూటీగా ముద్ర పడింది. అలాంటి లైఫ్ ఇచ్చిన ఆర్జీవీ నంబర్ ని బ్లాక్ చేశానంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అరియానా ప్రస్తుతం దావత్ అనే టాక్ షోను నిర్వహిస్తోంది. కొత్తగా విడుదలైన మూవీస్ కి సంబంధించిన సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసే దావత్ అనే షోలో ఆరియానా ఈ కామెంట్స్ చేసింది.
ఈ షోకి జబర్దస్త్ రాకేష్, సుజాత కలిసి వాళ్ళ 'కేసీఆర్' మూవీ ప్రమోషన్ కోసం ఈ కార్యక్రమానికి వచ్చారు. వచ్చాక రాకేష్ ఆరియానని ఇలా అడిగాడు " సర్ రాకింగ్ రాకేష్ అనే అతను ఇలా ఒక మూవీ తీసాడు. ఏదో విషయం మీద ట్వీట్ చేయించవా" అని అడిగాడు. అప్పుడు అరియానా "నేనసలు ఆయనతో టచ్ లోనే లేను" అని చెప్పింది. "జిమ్ చేసేటప్పుడన్నా చెప్పు" అరియనా అని సుజాత కూడా అడిగేసరికి "మీరు నమ్మతారా ఆరు నెలల క్రితమే ఏడాది క్రితమో నాకు ఆర్జీవీ గారికి చిన్న డిస్టర్బెన్స్ వచ్చి ఆయన నంబర్ ని బ్లాక్ చేసేసాను." అని చెప్పింది. దానికి రాకేష్ "నువ్వు బ్లాక్ చేసావా..ఆయనే ప్రపంచాన్ని బ్లాక్ చేస్తాడు కదా" అని సెటైర్ వేసాడు. ఇక ఈ షో ద్వారా ఆర్జీవీకి ఒక కోరిక కోరింది.."మీకు కెసిఆర్ మూవీ గురించి తెలిస్తే మీరు కూడా ప్రమోట్ చేయండి. నేను మీ నంబర్ ని అన్ బ్లాక్ చేస్తా..మీరు కూడా అన్ బ్లాక్ చేయండి. నాకు మీతో మాట్లాడాలని ఉంది" అని చెప్పింది. "ప్రేమ ఉన్న దగ్గర కోపం ఉంటుంది" అని రాకేష్ అనేసరికి "అవన్నీ ఆయనకు ఉండవు" అని ఆరియానా కౌంటర్ వేసింది. ఇంతకు ఇద్దరి మధ్య ఏ విషయం మీద డిస్టర్బెన్స్ వచ్చిందో అని ఆడియన్స్ ఆరా తీస్తున్నారు.
![]() |
![]() |